త్రిష ఎత్తుకొని ఆడిస్తున్న ఈ బుడతడు ఎవరో తెలుసా..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజీయ‌స్ట్ హీరోయిన్ లిస్టులోకి వస్తుంది త్రిష. ప్రస్తుతం వరుస‌ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న త్రిష కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ ఏడది మణిరత్నం భారీ మల్టీస్టారర్ మూవీ పోనీయ‌న్‌ సెల్వన్‌తో సూపర్ సక్సెస్ అందుకున్న త్రిష ప్రస్తుతం వరుస‌ సినిమాలతో బిజీ స్కెడ్యూల్‌ను గడుపుతుంది.

తాజాగా త్రిష ఒడిలో ఓ బుడతాడు సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరై ఉంటాడు అంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెట్టిజ‌న్స్‌. ఇంతకీ త్రిష ఎత్తుకున్న ఆ బుజ్జి బాబు ఎవరో కాదు మలయాల నటి మియా జార్జ్ కుమారుడట. త్రిష కీలక పాత్రలో నటించిన మూవీ ది రోడ్. ఇందులో మలయాళ భామ మియా జార్జ్‌ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ షూటింగ్ టైంలో త్రిష ఇలా మియా జార్జ్ కొడుకుతో ఆడుకుంటూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ది రోడ్ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే త్రిషా నటించిన‌ సినిమాల్లో ఒకటి లియో. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న రామ్ పార్ట్ 1, సుథురంగ వెట్టై 2, కమల్ హాసన్ – మణిరత్నం కాంబోలో కమల్ హాసన్ 234, అజిత్ కుమార్ – మగిజ్ తిరుమేని కాంబోలో వస్తున్న సినిమాల్లో కూడా నటిస్తుంది త్రిష. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో మీయా జార్జ్ కొడుకు బలే క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెట్టిజ‌న్స్‌.