ప్రస్తుత రోజుల్లో చాలా రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్లు వ్యాధులు బారిన పడుతున్నారు. అలా చాలామంది ఎదుర్కొంటున్న వాటిలో తోడా, కండరాలు పిక్కలు పట్టేయడం సమస్య కూడా ఒకటి. పగలంతా ఎలా ఉన్నా నిద్రలో మాత్రం ఇలా ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇలా పిక్కలు, తొడ కండరాలు పట్టేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వయసు మీద పడడం, పోషకాహార లోపం వివిధ రకాల గేమ్స్ ఆడడం వ్యాయామం చేస్తున్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం ఇలా పలు సమస్యల కారణంగా పిక్కలు, తొడ కండరాలు పట్టేస్తుండడం జరుగుతుంది.
నిద్రలో సడన్గా పిక్కలు పట్టడం వల్ల విపరీతంగా నొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం. ఐస్ రాయడం.. కండరాలు పట్టినప్పుడు పిక్కలు పట్టేసినప్పుడు.. విపరీతమైన బాధ కలుగుతుంది. కాసేపటి వరకు కాలు కదపలేము.. అలాంటి సమయంలో ఐస్ ముక్కలు ఒక క్లాత్ లో వేసి లేదంటే ఐస్ ప్యాక్ అయినా పర్వాలేదు దీంతో కొంతసేపు నొప్పి ఉన్నచోట్ల పెట్టాలి. కండరాలకు మృదువుగా మసాజ్ చేయడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి ఒత్తిడి తగ్గుతుంది.
కొంతమంది నీరు ఎక్కువగా తాగరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల డిహైడ్రేషన్ జరిగి కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. ఇలా పట్టేసినప్పుడు నీరు తాగాలి. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం వస్తుంది. బాడీలో పొటాషియం లెవెల్స్ తగ్గినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు అరటిపండు తింటే మంచి ఫలితం ఉంటుంది కొబ్బరి నూనె లవంగాలు ఈ పిక్కలు పట్టేసిన సమస్యతో ఇబ్బంది పడేటప్పుడు కాస్త కొబ్బరి నూనెలో కొన్ని లవంగాలు వేసి ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడిచేసి రాయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.