” భగవంత్ కేసరి ” ట్రైలర్ రిలీజ్ అప్పుడేన‌ట‌..!!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ అక్టోబర్ 8న లాంచ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో తాజాగా బజ్ వినిపిస్తుంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి సినిమాతో అర్జున్ రాంపాల్ విలన్ గా టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నాడు. అన్నట్లు సినిమాలో బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉన్నా… బాలయ్య పాత్ర తాలుకు ఆలోచనలు, యాక్టివిటీస్ చాలా సరదాగా సాగుతాయట.

అలాగే ఈ సినిమాలో ఫాదర్, కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ సినిమాలో శ్రీ లీల.. బాలయ్య కి కూతురుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.