గోపీచంద్, రవితేజ కాంబో మూవీలో తమిళ్ డైరెక్టర్..!!

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో నాలుగో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసేందుకు గోపీచంద్ భారీగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుండగా రవితేజను మరింత మాస్ గా చూపించేందుకు కసరత్తులు చేస్తున్నారట గోపీచంద్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తమిళ్ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్టులోకి ఇప్పుడు సెల్వా రాఘవన్ రాకతో మరిన్ని అంచనాలు రెట్టింపు అయ్యాయి. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

త్వరలోనే ఈ సినిమాలో నటించే వారి పేర్లు అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఇక రవితేజ తాజాగా నటించిన చిత్రం ” టైగర్ నాగేశ్వరరావు “. ఈ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదేవిధంగా ఇద్దరి కాంబో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటూ రవితేజ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.