సూపర్ స్టార్ విలువైన సలహాలు ఇచ్చాడట.. న‌టుడి కామెంట్స్ వైర‌ల్..!!

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చంద్రముఖి 2 ఈనెల 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. ఈ క్రమంలో లారెన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున… ఈ ముగ్గురిని నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనని లారెన్స్ చెప్పాడు.

చిరంజీవి, రజనీకాంత్ ప్రభావం తనపై ఎక్కువగా ఉందని, అందుకే వారిని అనుకరించకుండా కష్టపడుతున్నానని లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇక చంద్రముఖి 2 కోసం రజిని సార్ తనకు విలువైన సలహాలు ఇచ్చారంటూ లారెన్స్ కామెంట్స్ చేశాడు. కంగనాతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఎంఎం కీరవాణితో కలిసి పనిచేయడం తనకు ఆశీర్వాదమని లారెన్స్ అన్నాడు.

ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని లారెన్స్ తన ప్రసంగాన్ని ముగించాడు. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లైక ప్రొడక్షన్స్ నిర్మించింది. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చాడు. ఇంతకీ చంద్రముఖి 2 తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.