ప‌వన్ కళ్యాణ్ సినిమా పై భారీ హైప్ పెంచిన ” 7G బృందావన్ కాలనీ ” హీరో.. ఏం జ‌రిగిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు ఒకటి. దీనిని ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా… నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్గా తెరకెక్కనుండడంతో పాటు మొదటిసారి పాన్‌ ఇండియా లెవెల్ లో వస్తున్న పిరియాడికల్ మూవీ కావడంతో భారీగా ప్లాన్ చేశారు.

దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాపై 7G బృందావన్ కాలనీ సినిమా హీరో రవికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.” 7G బృందావన్ కాలనీ “రీ రిలీజ్ సందర్భంగా రవికృష్ణ పలు చానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ష‌.

అది భారీ సినిమా. అద్భుతంగా వస్తుంది. ఫాన్స్ ఆకలి తీరుస్తుంది. ఆ స్క్రిప్ట్ నాకు తెలుసు ” అని కీలక వ్యాఖ్యలు చేశాడు. రవికృష్ణ ఇంటర్వ్యూను ఫాలో అయిన ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా రవికృష్ణ హరిహర వీరమల్లు నిర్మాత ఏఎమ్ రత్నం కొడుకు కావడం ఆశ్చర్యం.