నందమూరి హీరోలకు హిట్‌లు ఇచ్చి.. మెగా హీరోలకు ప్లాప్ ఇచ్చిన స్టార్ దర్శకులు ఎవరో తెలుసా..!?

 

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీలలో ముందు వ‌రుస‌లో ఉండే కుటుంబాలు నందమూరి, మెగా ఫ్యామిలీలు, ఈ రెండు కుటుంబాల నుంచి ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఈ కుటుంబాల నుంచి వచ్చిన స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎంతోమంది స్టార్‌ డైరెక్టర్లు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రెండు ఫ్యామిలీలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్‌లు అందుకున్న వారు ఉన్నారు.. మరి కొంతమంది ప్లాప్‌ అందుకున్న దర్శకులు కూడా ఉన్నారు. ఆదర్శకులు ఎవరో ఇక్కడ చూద్దాం.

ముందుగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను.. బోయపాటి ముఖ్యంగా నట‌సింహం బాలకృష్ణతో మూడు సినిమాలు తీశాడు. వాటిలో సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు కూడా ఒక సినిమాను మించి మరో సినిమా అన్నట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అదేవిధంగా బోయపాటి.. మెగా హీరో రామ్ చరణ్ తో కూడా వినయ విధేయ రామ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలింది. అదేవిధంగా మరో మెగా హీరో అల్లు అర్జున్‌తో సరైనోడు సినిమా తీసి హిట్ అందుకున్నాడు.

అలాగే నందమూరి హీరో ఎన్టీఆర్ తో దమ్ము సినిమా తీసి భారీ ప్లాప్‌ అందుకున్నాడు. తర్వాత మరో స్టార్ దర్శకుడు కొరటాల శివ కూడా.. నందమూరి కుటుంబంలోని స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మూవీ తీసి ఇండస్ట్రీ హీట్ అందుకున్నాడు. అలాగే ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఆచార్య మూవీ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్‌చరణ్ కూడా కీలకపాత్రలోరలో నటించాడు. ప్రస్తుతం కొరటాల నందమూరి హీరో ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కచ్చితంగా కం బ్యాక్ ఇవ్వాలని గట్టి కసిగా ఉన్నాడు. ఇలా ఈ ఇద్దరు దర్శకులు మెగా హీరోలు కంటే నందమూరి హీరోలకి ఎక్కువ విజయాలు ఇచ్చారు.