10 నిమిషాల్లో రెడీ అయ్యే సేమియా రవ్వ కిచిడి.. తింటే వదిలిపెట్టరు..!!

ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో అందరూ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే హెల్తీ ఫుడ్ ను వండడానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఫుడ్ కేవలం నిమిషాల్లో ఎంతో టేస్టీగా తయారవుతుంది. ఇక ఉడికించిన వెజీస్‌కూడా ఇందులో కలుపు తయారు చేస్తున్న డిష్ కావడంతో ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అయితే ఈ సేమియాతో చేసే ఉప్మా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మార్నింగ్ బిజీ స్కెడ్యూల్‌లో చేసుకునే సేమియా ర‌వ్వ ఉప్మా లేదా సేమియా కిచిడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

కావలసిన పదార్థాలు సేమియా పావుకప్పు, బొంబాయి రవ్వ పావు కప్పు, నూనె రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్‌లు, ఉల్లిపాయ చీలుకలు ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్. క్యారెట్ ముక్కలు పావుకప్పు, ఫ్రెంచ్ బీన్స్ 3, బటాని రెండు టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు క‌ప్పు, మూడు టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, జీడిపప్పు 10, ఉప్పు తగినంత, అల్లం తరుగు ఒక టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నీళ్ళు 3 కప్పులు, నిమ్మ ర‌సం ఒక టీ స్పూన్.

స్టవ్ పై పాన్ పెట్టుకుని నెయ్యి వేసి అందులో సేమియాలు వేసుకొని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. వేరొక పాన్‌లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపు బాగా వేగాక.. జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకొని మగ్గించాలి. తర్వాత అల్లం తరుగు, క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి మరి కాసేపు వేయించాలి. క్యారెట్, బీన్స్ వేగాక నీళ్లు పోసి హై ఫ్లేమ్ లో మరగ‌నివ్వాలి.

మరుగుతున్నంత ఎసరులో వేపుకున్న సేమియా, ర‌వ్వ‌ వేసి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడకనివ్వాలి. సేమియా ఉడికిన తర్వాత మూత తీసి చివరిగా కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా నెయ్యి వేసి మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దీని రుచి అమోఘంగా ఉంటుంది.