ఫ‌స్ట్ ఆడిష‌న్స్‌లోనే ప‌క్క‌పైకి ర‌మ్మ‌నాడు.. న‌టి సంచ‌ట‌న క‌మెంట్స్ వైర‌ల్‌..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచ కాస్టింగ్ కౌచ్ ఇబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్ హీరోయిన్లతో సహా కీరోల్స్‌లో నటించిన నటినటులు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు మీ టూ ఉద్య‌మం ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా వారి అనుభవాలను చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఇక‌ ఇటీవల కార్తీక్ ర‌త్నం, స‌తీష్ వ‌ర్మ కాంబోలో వ‌స్తున్న‌ నయా మూవీ చాంగురే బంగారు రాజా తో హీరోయిన్గా పరిచయమైంది యంగ్ బ్యూటీ గోల్డ్ నిస్సి.. అయితే నిస్సి కూడా త‌న కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ఇంటర్వ్యూలో భాగంగా షేర్ చేసుకుంది. గోల్డ్ నిస్సి మాట్లాడుతూ.. హీరోయిన్గా ఇదే నా ఫస్ట్ మూవీ.. కరప్టెడ్ కానిస్టేబుల్ గా ఈ సినిమాలో నటించాను. నా క్యారెక్టర్ లో హ్యూమర్ తో పాటు లవ్, ఎమోషన్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి అంటు వివ‌రించింది.

మెకానిక్ గా కార్తిక్, కానిస్టేబుల్ గా నేను మా ఇద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మీరు ఆ సీన్స్ ఎంజాయ్ చేస్తారు అంటు చెప్పుకొచ్చింది. అలాగే ఇంటర్వ్యూలో భాగంగా లైంగిక వేధింపులపై మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ నాకేమీ పెద్దగా ఎదురుకాలేదని కాకపోతే ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు బాగా చేశావు.. మరి నాకేం లేదా.. అంటూ ఒక ఆయన డ‌బుల్ మీనింగ్‌లో మాట్లాడాడని.. అప్పుడు నాకు అర్థం కాలేదు. అంతకుమించి పెద్దగా ఇబ్బంది పడలేదని వివరించింది. ఇక హీరో రవితేజ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.