అది లేద‌ని తెలిసిన‌.. ఉందనుకొని నటించా.. రకుల్ ప్రీత్..!!

వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌ ను సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి శాసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం రవికుమార్ తెరకెక్కించనున్న అయ్యాలాన్‌ ల్లో శివ కార్తికేయన్ స‌ర‌స‌న న‌టిస్తుంది. కథ అంశంతోనే కాక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ఈ సినిమా కొత్త ట్రెండ్ సృష్టించబోతుందని సినీవర్గాల టాక్.

పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఇప్పటివరకు చూడని తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉండబోతున్నాయట. ఇక ఈ ప్రాజెక్టులు పనిచేసిన తన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రకుల్ జీవితంలో ఒకేసారి కలిగి మర్చిపోలేని అనుభూతిని ఈ సినిమాలో పొందాను. ఈ సినిమాలో నేను భాగం కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ఓ గ్రహాంతరవాసి ఉంది.. అంటూ న‌వ్వింది.

షూట్ చేస్తున్నప్పుడు ఎవరూ లేరని తెలుసు.. కానీ ప్రజలు ఈ సినిమాలో గ్రహాంతరవాసి ఉందని నమ్మే విధంగా రూపొందించారు. అలా ఈ సినిమాను చేసాం. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో దీన్ని రూపొందించాం. నిజంగా ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఆ అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించాను అంది రకుల్. ఇక‌ మేరీ పత్ని కా రీమేక్, భారతీయుడు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాటానికి సిద్దంగా ఉంది ర‌కుల్.