పుష్ప 2 లో ప్రియమణి.. క్లారిటీ ఇచ్చిన‌ నటి..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియ‌మణి. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ప్రియ‌మణి ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మొదట్లో బుల్లితెరపై డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన ఈ బ్యూటి తర్వాత సినిమాల్లో క్యారెక్ట‌ర్‌ ఆర్టిస్ట్ గా అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలో కీలక పాత్రలు నటించింది. నయనతార, విజయసేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

ఇక ఈ ఏడాది నాగచైతన్య తో కలిసి కస్టడీ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించింది. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రియమణి నటించబోతుందంటూ న్యూస్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణి నటిస్తుందని న్యూస్ పై ఆమె తాజాగా స్పందించింది. తనపై వస్తున్న వార్తలను చూసి ఆమె షాక్ అయినట్లు ప్రియ‌మ‌ణి వివరించింది.

పుష్ప 2 లో నటించటంలేదని ఆమె స్పష్టం చేసింది. ఆమెపై వచ్చిన ఈ రూమర్ చూసి వెంటనే మేనేజర్ కు కాల్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అయితే అవకాశం వస్తే తప్పకుండా అల్లు అర్జున్‌తో మూవీలో నటిస్తానని పేర్కొంది. ఇక పుష్ప సినిమాలో విజయ్ సేతుపతి ఒక కీరోల్‌ పోషిస్తున్నాడు. ఆయన భార్యగా ప్రియ‌మణి నటిస్తున్నారని కొద్దిరోజులుగా రూమర్స్ వచ్చిన ఇప్పుడు ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.