గొడ్డుకారం తింటే ఎక్కువ కాలం బతుకుతారు.. స్వీట్స్ తింటే గోవింద..!!

రిచ్ పీపుల్ తో పోలిస్తే గొడ్డుకారం తినే పేద్దలు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని విషయాన్ని చాలా మంది గమనించే ఉంటారు. అంతెందుకు 40 ఏళ్లకే యువకుల్లో బిపి, షుగర్ వంటి జబ్బులు వచ్చి చేరుతున్నాయి. పేద్దల్లో మాత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని తాజా అధ్యయనం తెలిపింది. అధికంగా గుడ్డుకారం తినేవారిలో ఏకంగా 14% మరణం తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు.

అలాగే వాళ్లకి గుండె జబ్బు, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ళ నొప్పులు, నీరసం వంటి సమస్యలు కూడా ఎదురవ్వడం లేదని పరిశోధనలో వెళ్లడైంది. 30 నుంచి 79 ఏళ్ల వయసున్న 4,90,000 మంది వ్యక్తులపై చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలు గుర్తించారు. ఏడేళ్లపాటు వీరి ఆరోగ్యాన్ని పరిశీలించిన సైన్‌టిస్ట్‌లు.. ఈ కాలంలో 20 వేల మంది చనిపోయినట్లు తెలిపారు. వారికి ఒకసారి కంటే తక్కువ స్పైసి ఫుడ్స్ తినే పార్టిసిపెంట్లతో పోలిస్తే… వారానికి ఒకటి లేదా రెండు రోజులు స్పైసి ఫుడ్స్ తినే వారిలో 10 శాతం తక్కువ మరణ ప్రమాదం ఉందని చెబుతున్నారు.

దాదాపు ప్రతిరోజు స్పైసి ఫుడ్స్ తినే వారికి ఒక్కసారి కంటే తక్కువ స్పైసి ఫుడ్స్ తీసుకునే వారితో పోలిస్తే 14% తక్కువ మరణ ప్రమాదం ఉందన్నారు. ఈ రిజా రిజల్డ్ పురుషులు, స్త్రీలలో ఒకే రకంగా ఉందని.. మద్యం సేమించని వారు మాత్రం బలంగా ఉన్నారని వివరణ ఇచ్చారు. తాజా సుగంధ ద్రవ్యాలు, ఎండిన మిరపకాయలు, మసాలా దినుసులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా సూచించాయి.