నా డబ్బు నేను ఎంజాయ్ చేస్తా.. నీకేంటి రా నొప్పి.. మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో నటించిన ఈమె బుల్లితెరపై కూడా హోస్ట్ గా రాణించింది. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న మంచు లక్ష్మి ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఆమెపై ట్రోల్స్, కామెంట్స్ చేస్తూ ఉండేవారికి తన స్టైల్ లో గట్టిగా సమాధానం చెబుతూ ఉంటుంది. ఇక తాజాగా మరోసారి మంచు లక్ష్మి ఘాటుగా స్పందించింది.

ఇటీవల ఆమె విమానం ఎక్కేందుకు వెళ్ళినప్పుడు కార్పెట్‌ అపరిశుభ్రంగా ఉందని ఏయిర్‌పోర్ట్‌ వారికి ఒక ట్విట్‌ పెట్టానని దానికి వారు విచారణ వ్యక్తం చేశారు. కానీ నెటిజెన్లు మాత్రం ఆమెపై దారుణంగా కామెంట్స్ చేశారంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ఇటీవల ఎయిర్పోర్ట్లో కార్పెట్ శుభ్రంగా లేదని వీడియో పెట్టాను. నా ఐఫోన్తో తీసిన ఫోటో వల్ల ఇంకా బాగా కనపడుతుంది అనుకున్నాను. అంతే వరుసగా చాలా మంది కామెంట్స్ మొదలు పెట్టారు. ఓ నువ్వు బిజినెస్ క్లాస్ లో వెళ్తున్నావా.. నీకు ఐఫోన్ ఉందా.. అంటూ కామెంట్ చేశారు.

ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా.. నా కష్టం.. నా సంపాదన.. నా ఖ‌ర్చు.. నీకు ఏంట్రా నొప్పి నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా అంటూ ఫైర్ అయింది. ఎవరైనా ఒక మహిళ మాట్లాడిందంటే చాలు అందులో తప్పులు వెతకడమే కానీ అసలు సమస్య ఏంటి అని అంశాన్ని మాత్రం చూడరా.. అసలు మీ సమస్య ఏంటి.. డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా. మాకు ఎవరూ ఉచితంగా డబ్బులు ఇవ్వడం లేదు. మా అమ్మ , నాన్న కూడా నాకు డబ్బులు ఇవ్వరు. మాకు చిన్నప్పటి నుంచి కష్టపడడం నేర్పించారు. డబ్బుంటే సంతోషంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు అంటూ వివ‌రించింది.

డబ్బు కేవలం ఫ్రీడమ్ ను మాత్రమే ఇస్తుంది నేను చిన్నప్పటి నుంచి చాలా డబ్బును చూసా వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్లతో పుట్టి పెరిగా. కానీ అమెరికాలో ఉన్నప్పుడు నా తిండి కోసం నేనే కష్టపడి పని చేశా. డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి. మనం ప్రతిదానికి తప్పు పట్టకూడదు. చాలా చిన్న జీవితం వేరే వాళ్ళ కోసం బతికే బ్ర‌తుకు ఓ బ్ర‌తుకే కాదు ఇతర అభిప్రాయం పట్టించుకోకుండా మనకు నచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్లడమే. ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఉండాలి పిల్లలను చూసుకోవాలి అంటూ కొంతమంది చెబుతూ ఉంటారు.

ఆ పనులు చేయడం కరెక్టే కానీ అవే పనులు మాత్రమే చేయాలి అనడం అసలు కరెక్ట్ కాదు నీకు నచ్చిన పనిని నువ్వు చెయ్యి. ఇంత చిన్న లైఫ్ లో నీకు నచ్చినది కాకుండా ఒకరి కోసం బతికి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ట్విట్టర్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.