భారతీయుడు సినిమాను ఆ హీరో తో తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారా..?

పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ కావచ్చు. కానీ మనం పుట్టక ముందు నుంచే పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శంకర్. అతడి డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ అప్పట్లో ఇండియన్ బాక్సాఫీస్ ని ఊపు ఉపాయి. అసలు ఆ రోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలరు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ స్థాయిలో శంకర్ టేకింగ్ ఉండేది. అందుకే ఇప్పుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇలా ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చిన శంకర్ బ్రాండ్ ఇప్పటికీ అలాగే ఉండడానికి కారణం కూడా శంకర్ టేకింగే.

అలా శంకర్ డైరెక్షన్లో ఆణిముత్యం లాంటి సినిమా భారతీయుడు. కమలహాసన్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించింది. ఒక తమిళ్ లోనే కాదు హిందీ మరియు తెలుగు భాషలోనూ మూవీ బీభత్సవం సృష్టించింది. అప్పట్లో శంకర్ ఈ మూవీని రెండు భాషల్లోనూ తీయాలనుకున్నాడట. తమిళ్ లోనే కాక తెలుగులోనే ఈ సినిమాను రూపొందించాలనుకున్న శంకర్ చిరంజీవితో ఈ సినిమాను తీయాలని ఫిక్స్ అయ్యాడట. చిరంజీవికి కథ వినిపించగా చిరంజీవి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

శంకర్ కమలహాసన్ నటించిన కొన్ని సీన్స్ ని చూపించి మీ రోల్ ఇలా ఉండబోతుంది అని చెప్పగా.. కమల్ హాసన్ నటించిన రేంజ్ లో నేను ఎప్పటికీ చేయలేను. ఆయన నటన అద్భుతంగా ఉంది. దయచేసి ఈ సినిమాను తెలుగులో కూడా ఆయనతోనే డబ్ చేయించండి. వేరే ఏ హీరోని కూడా అడగవద్దు. ఆయనలా ఎవరు చేయలేరు. ఈ క్యారెక్టర్ ఆయన కోసమే పుట్టినట్లు ఉంది అని చెప్పాడట. దీంతో శంకర్ తెలుగులో కూడా కమల్ హాసన్ తోనే ఈ సినిమాను డబ్ చేయించి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కమలహాసన్ తప్ప ఆ క్యారెక్టర్ లో నిజంగానే ఎవరు నటించినా ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వదు అంటూ కామెంట్ చేస్తున్నారు.