ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోషూట్లతో యువతను అలరిస్తూ.. ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసే ఈమె తాజాగా షేర్ చేసిన ఒక ఫోటో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇకపోతే ఆమె ఫోటో చూసిన నెటిజన్స్ అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. సమంత ఎందుకు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ రకరకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సమంత ప్రస్తుతం మయోసైటీస్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే . అక్కడే కొన్ని నెలల పాటు వుండి.. పూర్తిగా చికిత్స తీసుకోని .. కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇండియాకి తిరిగి రావాలని ఆమె నిర్ణయించుకుంది. ఇక ఇటీవల రెగ్యులర్గా పోస్టులు , తమ జిమ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే ఈమె అలా ఒక ఫోటో పోస్ట్ చేయగా అందులో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
అయితే ఇది చూసిన ఒక అభిమాని మీ ఫేస్ లో గ్లో వచ్చింది ఏంటి అని అడగ్గా ఆమె సమాధానం ఇస్తూ.. మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు.. మయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. దాంతో కొంచెం చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డాను. ఫేసులో చేంజ్ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా తయారు చేస్తానని చెప్పింది. చూడాలి మరి అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే స్టెరాయిడ్స్ వాడుతున్నందుకే సమంత ఇలా తయారయ్యిందా అంటూ నటిజెన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.