విజ‌య్ దేవ‌ర‌కొండ‌ – రామ్ ఇద్ద‌రు ఆ డ‌బ్బులు వెన‌క్కి తెస్తారా…!

విజయ్ దేవరకొండ – సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ ఖుషి. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విజయ్. గ‌తంలో విజ‌య్ న‌టించిన లైగర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టం వచ్చింది. ఇక ప్రస్తుతం నటిస్తున్న ఖుషి సినిమాతో ఎలాగైనా విజయ్ దేవరకొండ టార్గెట్‌ను రీచ్ అవ్వాలి లేదంటే అతని మార్కెట్ మరింతగా పడిపోతుంది.

ప్రస్తుతం విజయ – సమంత ఎదురుగా రూ.53 కోట్ల బిజినెస్ టార్గెట్ ఉంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. అలాగే రామ్ పోతినేని హీరోగా బోయపాటి దర్శకత్వంలో తరికెక్కుతున్న స్కంద మూవీ కూడా ఎలాగైనా హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. రామ్ పోతినేని కూడా తన‌ వారియర్ సినిమాతో గతంలో డిజాస్టర్‌ను చెవి చూశాడు. ఈ సినిమాతో దాదాపు రూ.17 కోట్ల వరకు నిర్మాతలకు నష్టం వాటిల్లింది. దీంతో స్కంద సినిమాతో ఎలాగైనా రామ్ పోతినేని హిట్ కొట్టాల్సిందే.

రామ్ పోతినేని ఎదురుగా రూ.60 కోట్ల టార్గెట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు హీరోలకు ఇప్పుడు రాబోతున్న సినిమాలతో సక్సెస్ రావాలి. లేదంటే వారి నెక్స్ట్ రాబోయే సినిమాలపై మార్కెట్ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే వారి నెక్స్ట్ సినిమాలకు కూడా నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మరి ఈ రెండు సినిమాలు పాజిటివ్‌టాక్‌తో టార్గెట్‌లు రీచ్ అవుతాయో..? లేదో..? చూడాలి.