మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నటించారు. మల్టీ స్టారర్‌గా తరికెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్ – రామ్‌చరణ్ ఈ సినిమా కంటే ముందు నుంచే మంచి స్నేహితులన సంగతి తెలుసు. ఇక ఈ మూవీలో నటించే టైంలో ఎన్టీఆర్ – రామ్‌చరణ్ మద్య బాండింగ్ కూడా పెరిగిందని చెప్పాలి.
ఇక ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూ కు హాజరయ్యాడు. అందులో భాగంగా రామ్ చరణ్‌ను ఇంటర్వ్యువర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఎన్టీఆర్‌కి ఉన్న క్వాలిటీస్ లో ఏ క్వాలిటీ అయినా మీకు ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా అంటూ ఇంటర్ ప్రశ్నించారు. దానికి రామ్‌చరణ్ స్పందిస్తూ అవును ఎన్టీఆర్‌కి అంతులేని ఎనర్జీ ఉంది అది ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కాదు.
అంతలా ఎనర్జీ నాలో అయితే లేదు. ఛాన్స్ వస్తే మాత్రం అతని ఎనర్జీ నేను అప్పుగా తీసుకుంటాను అంటూ చరణ్ సమాధానం చెప్పాడు. చెర్రీ.. ఎన్టీఆర్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.