ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఓ సన్నివేశం ఒకటి జరిగింది. దివంగత హీరో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తనయుడు హర్ష వివాహం నందమూరి బాబాయ్ అబ్బాయిల కలయికలకు వేదిక అయింది. ఇక నిన్న హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు నందమూరి మరియు నారా కుటుంబాలు హాజరయ్యాయి.. అదేవిధంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర నటులు, రాజకీయ నాయకులు కూడా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అయితే ఈ వివాహ వేడుకల్లో రెండు విషయాలు మాత్రం నందమూరి అభిమానులకు ఆనందాన్ని కలిగించాయి. అందులో మొదటిది నందమూరి వారసులైన ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి నందమూరి అభిమానులకు ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా ఈ వివాహ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబాయ్ బాలయ్యను ఆప్యాయంగా పలకరించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ప్రస్తుతం నందమూరి అన్నదమ్ములు, బాబాయ్ అబ్బాయిల సంబంధించిన ఈ రెండు విషయాలను చూసి నందమూరి అభిమానులు సంతోష పడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం మాత్రం నందమూరి అభిమానులను ఎంతగానో కలవరపెడుతుంది. నందమూరి బాలకృష్ణ వేదిక ముందు కూర్చుని అతిథులతో సంభాషిస్తుండగా జూ.ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. బాలయ్య మాత్రం అంతగా స్పందించినట్లు కనిపించలేదు. దాంతో ఎన్టీఆర్ మిగిలిన వాళ్లను రిసీవ్ చేసుకునే పనిలో పడ్డారు.
అయితే ఇంతకు ముందు కూడా ఇదే సీన్ జరిగింది. కొన్ని నెలల క్రితం నందమూరి తారకరత్న సంస్మరణ కార్యక్రమంలో కూడా ఇలానే … తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన తారక్ తన బాబాయ్ బాలకృష్ణను చూసి నిలబడి నమస్కారం చేశారు. ఆయన చూసీచూడనట్లు వెళ్లిపోయారనే కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఇదే రిపీట్ కావడంతో.. ఈ నందమూరి బాబాయ్ అబ్బాయిల మధ్య గ్యాప్ ఇంకా అలాగే కొనసాగుతుందా అందరూ షాక్ అవుతున్నారు.ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరు ఒక వేదికమీదకు వస్తే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. బాబాయి అబ్బయి ఎంతో సంతోషంగా కలిసి కనిపిస్తే చూడాలని ఆశపడుతున్నారు. అయితే రాబోయే రోజులైనా నందమూరి అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
బాబాయ్ తో చేయ్ కలిపిన అబ్బాయ్ 🤝 🔥
Nandamuri – We are always United 💪 pic.twitter.com/GkZ5RVom9Q
— Venu M Popuri (@Venu4TDP) August 20, 2023