వరుణ్ తేజ్ హీరోగా గాండీవధారి అర్జున్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో బి ఏ బి ఎస్ ఎన్ ప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. సాక్షి వైద్య హీరోయిన్గా తరికెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న భారీ రేంజ్‌లో విడుదల కాబోతుంది.
ఇక తాజాగా ఈ సినిమా ఫవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్‌ని మూవీ మేకర్స్ విడుదల చేశారు. వరుణ్ పవర్ ఫుల్ డిటెక్టివ్ ఆఫీసర్‌గా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఈ ట్రైలర్‌లో పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైలెట్గా నిలిచింది. ఇక ఈ టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచిందని చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి