బూడిద గుమ్మడికాయ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..!

బూడిద గుమ్మడి కాయ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఇది చాలా పెద్దది అని అవును ఆకారంలో పెద్దగా ఉండే గుమ్మడికాయ అద్భుతమయిన పోషక విలువలు కలిగి ఉంటుంది , అందుకే దీన్ని కొన్ని సార్లు ఔషధంగా కూడా వాడతారు.బూడిద గుమ్మడి కాయ పుచ్చ జాతికి చెందిన ఒక ప్రత్యేకమైన కాయ ఇందులో నీరు దాదాపు 96% మిగతావి ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. భారత దేశం లో ఆయుర్వేద ఔషధాలలో దీనిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

1.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
‘బూడిద గుమ్మడికాయ’ లేదా పర్వల్ వంటి ఆరోగ్యకర కూరగాయలు జీర్ణశయానికి మంచిది. అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉండే ఈ రకం కూరగాయలు జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తాయి. అంతేకాకుండా, దీని వలన జీర్ణశయాంతర సమస్యలతో పాటూ, కాలేయ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.

2.మలబద్దకం నుంచి ఉపశమనం:
మలబద్దకం వలన సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే పాటించే ఆహార ప్రణాళికలో బూడిద గుమ్మడికాయను కలుపుకోండి. దీనిలో ఉండే విత్తనాలు మలాన్ని భయటకు పంపేలా చేసి మలబద్దకాన్ని తగ్గించి వేస్తాయి.

3.బరువు తగ్గుటలో సహాయం:
మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ ఆహార ప్రణాళికలో వీటిని కూడా కలుపుకోండి. ‘బూడిద గుమ్మడికాయ’ లేదా పర్వల్ తక్కువ క్యాలోరీలను అందించి, ఎక్కువ సమయం పాటూ పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేసి, మీ ఆకలిని తగ్గిస్తాయి.

4.రక్తాన్ని శుభ్రపరుస్తుంది:
క్రమంగా ‘బూడిద గుమ్మడికాయ’ లేదా పర్వల్ తినటం వలన రక్తం పరిశుభ్రపరచపడుతుంది. రక్తాన్ని శుభ్రపరచటమేకాకుండా, చర్మం అందంగా కనపడేలా చేస్తుంది.

 

5.ఫ్లూ జ్వరాన్ని తగ్గిస్తుంది:
ఆయుర్వేద వైద్యశాస్త్ర ప్రకారం, బూడిద గుమ్మడికాయ శరీర రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఫ్లూ జ్వరాన్ని తగ్గించే ఔషదంగా కూడా దీనిని పేర్కొనవచ్చు. వీటితో పాటుగా అధిక శరీర ఉష్ణోగ్రతలు మరియు గొంతు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.