‘ భోళా శంకర్ ‘ కు ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ కానుందా.. ఆమె వల్ల చిరంజీవికి నిరాశ తప్పదా..?

ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఒక సెంటిమెంట్ ఫాలో అయ్యి మూవీ హిట్ అయితే అదే సెంటిమెంట్‌తో పదేపదే హిట్లను తమ‌ ఖాతాలో వేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఒకసారి కొన్ని బ్యాడ్ సెంటిమెంట్ల వల్ల సినిమా ఫ్లాప్ అయినట్లు అయితే మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శక,నిర్మాతలు, స్టార్ నటీనటులు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారు. చిరంజీవి కూడా అలా సెంటిమెంట్లు ఫాలో అయ్యే విషయంలో ముందుంటారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన ‘ భోళా శంకర్‌ ‘ కి కూడా ఒక సెంటిమెంట్ రిపీట్ అవ్వబోతుందట. కానీ అది బ్యాడ్ సెంటిమెంట్ అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఎంటా సెంటిమెంట్..? అనుకుంటున్నారా.. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో కుర్ర హీరోలకు దీటుగా హిట్ సినిమాల‌ని తన ఖాతాలో వేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక‌ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాలో నటించగా ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తన మూవీ టీంతో ప్రమోషన్స్ భాగంగా ఫుల్ ఎనర్జిటిక్ గా పాల్గొంటున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా తమన్నా చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్ రిలీజై మంచి రెస్పాన్స్ సాధించాయి. దీంతో సినిమా ఎలాగైనా హిట్ కొడుతుంది అనుకున్న‌ మెగా ఫ్యాన్స్ లో చిన్న సందేహం కూడా ఉంది. అది కూడా చిరంజీవి చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్ విషయంలోనే నట. చిరంజీవికి కీర్తి సురేష్ బ్యాడ్ సెంటిమెంట్ అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కీర్తి సురేష్ రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది.

ఆ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటించినా సినిమా రిలీజై ఫ‌స్ట్‌డేనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఏ కారణాలతో ఫ్లాప్ అయిందో తెలియదు గానీ కీర్తి సురేష్ చెల్లెలుగా నటించిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో.. చిరంజీవి భోళా శంకర్ కూడా ప్లాప్ అవుతుందేమోనన్న సందేహంలో పడ్డారు మెగా ఫాన్స్. ఇదే కారణంతో చిరంజీవి సినిమా కూడా డిజాస్టర్ అవుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఇలాంటి చెత్త నమ్మకాలను ముందు వదలండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.