బాలయ్య భైరవద్వీపం సినిమా ఆ రోజుల్లో ఎంత కలెక్షన్ రాబట్టిందో తెలుసా..!

చిత్ర పరిశ్ర‌మ‌లో కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము. మన చిన్నతనంలో చూసిన‌ ఆ సినిమాలో మన మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భైరవద్వీపం. బాలయ్య కెరీర్ లో ఎన్నో గొప్ప చిత్రాలు ఉండొచ్చు ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉండొచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరికొన్ని ఇండస్ట్రీ విజయాలు అందుకోవచ్చు కానీ భైరవద్వీపం లాంటి క్లాసిక్ ఖండాన్ని ఎప్పటికీ ఆయన తీయలేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బాలకృష్ణతో ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా తీసిన సంగీతం శ్రీనివాసరావు మూడు ఏళ్ల తర్వాత మళ్లీ బాలయ్యతో భైరవద్వీపం లాంటి గొప్ప సినిమా చేశాడు. ఇలాంటి అనుముత్యాలు ఆ రోజుల్లో కేవలం సంగీతం శ్రీనివాసరావు గారే చేసేవారు. ఆయన విజన్ కనీసం 20 సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉంటుంది.
బాలయ్యతో ఎవరైనా మంచి మాస్ మసాలా సినిమాలు తీయాలనుకుంటారు.. కానీ సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి ఇలాంటి ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు.

భైరవద్వీపం సినిమాలో బాలయ్య త‌న‌ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ స్థాయి నటన ఆయన తరం హీరోలలో ఏ స్టార్ హీరో చెయ్యలేని విధంగా తన నటనతో అదరగొట్టారు. బాలయ్య తండ్రి నటరత్న ఎన్టీఆర్ మాత్రమే ఇలాంటి జానపద చిత్రాలు చేయగలడు.. ఇక మళ్ళీ బాలకృష్ణ భైరవద్వీపంతో తన తండ్రి తర్వాత అలాంటి సినిమాల్లో తాను కూడా చేయగలను అన్ని నిరూపించాడు. ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

ఈ సినిమా విడుదలై ఫుల్ రన్ లో దాదాపు రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక అంతే కాకుండా ఆ రోజుల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఎకబడి మరీ చూసే వారు. ఇప్పటికీ టీవీలో వస్తుంటే నేటితరం ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఎటువంటి గ్రాఫిక్స్ లేని కాలంలోనే సంగీతం శ్రీనివాసరావు తన దర్శకత్వ ప్రతిభతో ఎంతో గొప్పగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో పాటలు కూడా అదే విధంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇప్పటికీ ఆ పాటలకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోని ఒ గోప్ప‌ సినిమాగా నిలిచిపోయింది.