డైలీ కనీసం 5 గంటలకంటే తక్కువ నిద్రపోవడం వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ పరిస్థితి దీర్ఘంగా కొనసాగితే త్వరగా మరణం సంభవించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొంతమందికి ఆరోగ్యం వల్ల నిద్ర పట్టకపోవచ్చు. అలాగే నిద్ర తగినంతగా లేకపోవడం వల్ల కూడా మరికొందరిలో అనారోగ్యానికి దారితీస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఈ విషయాన్ని కనుగొనడానికి బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు 8 వేల మందిపై టెస్ట్ చేశారు. వారంలో యావరేజ్ గా నైట్ టైమ్ లో ఎన్ని గంటలు నిద్రపోతున్నారని రీసెర్చ్ చేసేవాళ్లను ప్రశ్నించారు. దీంతోపాటు గత 20 ఏళ్లలో డయాబెటిస్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో నిద్ర, అనారోగ్యాలు, మరణాలకు గల కారణాలను కూడా టెస్ట్ చేశారు. బ్రిటన్ శాస్త్రవేత్తలు స్టడీలో భాగంగా 48 నుంచి 50 ఏళ్ల వయసు గలవారులో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిని ఒక గ్రూప్‌గా విభజించారు. అదే వయసు గలవారిలో 7 గంటలు నిద్రపోయే వారిని మరో గ్రూప్‌గా విభజించారు.
ఈ రెండు గ్రూపులను కొంతకాలం టెస్ట్ చేయగా రోజు 5 కంటే తక్కువ నిద్రపోయేవారు 30% ఆదనంగా ఆరోగ్య సమస్యలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. దీనివల్ల వీరులో త్వరగా మరణం సంభవించే అవకాశాలు ఉంటున్నట్లు గుర్తించారు. ఇక వీరితో పోలిస్తే 7 గంటలు నిద్రపోయేవారిలోఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటున్నట్లు సైంటిస్టులు గమనించారు. పైగా 5 గంటలకంటే తక్కువ నిద్రపోయే వారితో పోల్చినప్పుడు అనేక విషయాల్లో 7 గంటలు నిద్రపోయేవారు యాక్టివ్‌గా ఉంటున్నారని, జీవన ప్రమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు. సాధారణంగా 7 నుంచి 8 గంటలు నిద్ర పోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అందుకే 5 గంటలకంటే తక్కువ నిద్రపోయే వారు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.