ప్రభాస్ స్పిరిట్ మూవీ ఏ జానర్ స్టోరీయో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయన నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోయినా ప్రభాస్ క్రేజ్ ఏం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాల గ్లింప్స్‌, టీజ‌ర్‌ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమాలు రిలీజై సక్సెస్ సాధించాయి అంటే ప్రభాస్ నెక్స్ట్ తీయబోయే సినిమాకు క్రేజ్ మరింతగా పెరుగుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ఫ్యాన్స్‌కే కాదు ట్రేడ్ వర్గాలకు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.

ఇంతకుముందు సందీప్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాస్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అనిమల్ సినిమా పైన కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే సందీప్ – ప్రభాస్ కాంబోలో వచ్చే సినిమా ఒక కొత్త జాన‌ర్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై ఆ స్టోరీ కనిపించలేదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.