బాలకృష్ణ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ చిరంజీవిలో లేదా.. ఇంతకీ అదేమిటంటే..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. వారి తర్వాత కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలగా రాణించారు. ఇక వీరి తర్వాత తరం హీరోలుగా వచ్చిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్‌లు కూడా స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఈ నలుగురి హీరోలు ప్రస్తుత తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ నలుగురు సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి మాత్రం ఎప్పుడూ కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ వస్తున్నారు. ఇక గత సంక్రాంతికి కూడా ఈ ఇద్దరి హీరోలు బాక్సాఫీస్ వ‌ర్‌లో నిలిచి విజయం సాధించారు. ఇదే స‌మ‌యంలో బాలకృష్ణ- చిరంజీవి క్వాలిటీల గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు బాలకృష్ణలో ఉన్నది చిరంజీవిలో లేని క్వాలిటీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బాలకృష్ణలో అందరూ ప్రధానంగా చెప్పేది ముక్కు మీద కోపం అవును మీరు వింటున్నది నిజమే బాలకృష్ణ ఏ విషయాన్నైనా మొహం మీదే చెప్పేస్తారు. ఆయనకు కోపం వస్తే ఆయనను ఆపడం ఎవరి తరం కాదు. ముందు ఎంత పెద్ద మనిషి ఉన్నారు అనేది అసలు చూసుకోరు వారిపై తన మనసులో ఏది ఉంటే అది మొహం మీదే చెప్పేస్తారు.

చిరంజీవి మాత్రం బాలయ్యకు విరుద్ధం ఆయనకు ఎంత కోపం వచ్చినా సరే చిరునవ్వుతోనే పలకరిస్తూ ఆయనను మోసం చేసిన సరే దానిని ఆయన చాలా సంతోషంగా స్వీకరిస్తారు. అంతేకానీ ఎదుటి వ్యక్తిని ఒక్క మాట కూడా అనరు. ఈ విషయంలో చిరంజీవి మనస్తత్వం చాలా గొప్పది. అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది బాలకృష్ణ కంటే చిరంజీవి క్వాలిటీస్ చాలా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది.