కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే సూర్యకు మార్కెట్ ఎక్కువగా ఉండేది. మరి ముఖ్యంగా సింగం 2, సింగం 3 సినిమాలకు కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ మార్కెట్ జరిగింది. ఇక ఇప్పుడు మన టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తుంది.
గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలనే కాకుండా.. ప్లాప్ అయిన సినిమాలను కూడా తిరిగి ఇప్పుడు మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు. అందుకు ఫాన్స్ ఉత్సాహమో లేదా ఆ క్లాసిక్ కల్ట్ సినిమాలను మరోసారి 4కే వెర్షన్లో చూడాలన్న కోరుకో ఏమో కానీ.. రీ రిలీజ్ చేసిన సినిమాలకు అదిరిపోయే కలెక్షన్లు అందిస్తున్నారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకు ఏకంగా 7 నుంచి 10 కోట్ల భారీ కలెక్షన్లు వచ్చాయి. అదేవిధంగా ఆరెంజ్ లాంటి ప్లాప్ సినిమాకు కూడా ఐదు కోట్ల కలెక్షన్ వచ్చాయి.
ఇక ఇప్పుడు సూర్య గతంలో ఎప్పుడో నటించిన సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్. ఈ సినిమా ఎప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆ సినిమాకు మన తెలుగు ఆడియోస్ అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. అయితే ఈ సినిమానికి మొత్తంగా మొదటి రోజు వసూళ్లలో అదిరిపోయే రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా తొలి రోజునే కోటి గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమా లిస్టులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చేరటం గ్రేట్ అని చెప్పాలి.
అది కూడా ఓ కోలీవుడ్ హీరో ప్లాప్ సినిమా ఎప్పుడో 15ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ రీరిలీజ్ చేస్తే తొలి రోజునే కోటి గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా నిన్న ఒక్కరోజే 24 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది అప్పట్లోనే కల్ట్ క్లాసిక్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు హరీష్ జైరాజ్ ఆల్బమ్ అప్పట్లో సెన్షేషన్ అని చెప్పక్కర్లేదు.