శంకర్ కూతురు అదితి ఫ్యాషన్ రేంజ్ మామూలుగా లేదుగా…..!

అదితి శంకర్ ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురుగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఐడెంటిటీ ఆమెది. అదితి సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో త‌న తండ్రి నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించు… ఏడాదిలోపు వస్తే సరే సరి లేదంటే ఇండస్ట్రీ పేరు ఎత్తకూడదు అని చెప్పారట. ఆ కండిషన్కు ఓకే చెప్పి తాను సినిమాల్లో ప్రయత్నించాను సాధించాను అంటుంది. డైరెక్టర్, సింగర్, యాక్టర్ ఇలా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

ఫ్రోషన్ డిజైనింగ్ కోర్స్ చేసి సొంతంగా తన పేరు మీద చెన్నెలో ‘ రుబీనా వోగ్ ‘ ఫ్యాషన్ కోర్స్ ను మొదలుపెట్టింది. ఎక్కువగా కొత్త తరం డిజైన్స్ కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ బ్రాండ్ డిజైన్స్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదే దీని బ్రాండ్ వాల్యూ, వివాహాది శుభకార్యాలకు ముందుగా ఆర్డర్ ఇచ్చే డిజైన్స్ చేయించుకోవచ్చు కూడా. కాస్త సరసమైన ధరలు లభిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ డిజైన్స్ కి స్టార్స్ ఉంటాయి.

ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలు కూడా ఉంది‌. అదితి ధరించిన రుబీనా వోగ్ సారీ ధర రూ. 8,500 మాత్రమే. జ్యూయల్స్ క్రియేషన్స్ పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన డిజైన్స్ ను అందించే స్టోర్. 2013లో అరవింద్ కట్రేలా దీనిని ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు వీరి డిజైన్స్ అన్నిటిలోనూ ప్రత్యేకంగా ఉంటాయి. అదే దీని బ్రాండ్ వాల్యూ. సింపుల్ డిజైన్స్ తో గ్రాండ్ లుక్కిచ్చి అందమైన ఆభరణాలను ఇక్కడ దొరుకుతాయి. పేరుకు దేశీ బ్రాండ్ అయినా దరఖాస్తు ఎక్కువగానే ఉంటుంది. ఫ్రీ బుకింగ్ అవకాశం కూడా ఉంది.