సింగ‌ర్ సునీత కొడుకు ఆకాష్ ‘ సర్కార్ నౌకరీ ‘ సినిమా టీజ‌ర్‌ ఎలా ఉందంటే ( వీడియో )

టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మెలోడీ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎన్నో వందల పాటలతో సంగీత ప్రియుల మనసును దోచుకుంది. అయితే ఇప్పుడు తన కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంలో ఆకాష్ కు జోడిగా భావన వళపండల్ నటిస్తోంది. సర్కార్ నౌకరీ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. 1996లో కొల్లాపూర్ లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ట్రైలర్లు తెలిపారు. దీనితో ఈ సినిమా పిరియాడిక్ ఫిల్మ్ అని అర్థమైంది. ఈ టీజర్ లో మొదటగా ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎంత విలువ ఉండేదో చూపించారు. ఈ ప్రచారం సినిమాలో హీరోను గవర్నమెంట్ ఎంప్లాయ్ గా చూపించారు.

హీరోకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఓ పల్లెటూరు అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినట్లు ఆ తరువాత తనకు వచ్చిన ఉద్యోగం వల్ల అతడు ఎలాంటి ? పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే పాయింట్లు సినిమాలో చూపించబోతున్నట్లు టీచర్ ద్వారా అర్థం అయింది. ఈ సినిమాని లెజెండ్రీ డైరెక్టర్ కే. రాఘవేంద్రరావుకు చెందిన ఆర్.కే టెలీ షా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సినిమాలో తనికెళ్ళ భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య, రాజేశ్వరి ముల్లపూడి, మణిచందన, త్రినాధ్, రమ్య పొద్దూరి తదితరులు కీలక పాత్రలో వహిస్తున్నారు. శాండిల్య సంగీతం అందించారు. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గంగనుమోని శేఖర్ ఏ చూసుకుంటున్నాడు. చూడాలి మరి సింగర్ గా ఉన్నత స్థాయికి చేరుకున్న సునీత పేరును తన కొడుకు ఎంతవరకు నిలబెడతాడు..‌!!