మేకప్ ఒకప్పుడు కళాకారుల్లో, నటినటుల్లో మాత్రమే ఈ పదం వినిపించేది. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మేకప్ కిట్ ఉండాల్సిందే. ఎక్కడపడితే అక్కడ మేకప్ వస్తువులు దర్శనమిస్తూనే ఉంటున్నాయి. దానికి ప్రధాన కారణం ఆఫీసులకు వెళ్లే మహిళల సంఖ్య పెరగడం కూడా ఓ కారణమట. బయటకి వెళ్లాలంటే మహిళలు చాలామంది మేకప్ కి ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఊహించని స్థాయిలో భారత దేశంలో మేకప్ బిజినెస్ గణనీయంగా పెరిగింది.
తాజాగా నివేదించిన అధ్యయనం ప్రకారం గత 6 నెలల కాలంలో ఇండియాలో 10 నగరాల్లోనూ 100 మిలియన్లకు పైగా లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ కొనుగోలు అయ్యాయని తెలుస్తుంది. ఈ ఒక్క లెక్క చాలు భారతదేశంలో కాస్మెటిక్ వ్యాపారం ఏ రేంజ్ లో నడుస్తుందో చెప్పొచ్చు. కేవలం మేకప్ ఖర్చులకే మన భారతీయులు 6 నెలల్లో రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారంటే ఏ రేంజ్ లో మేకప్ ను ఫాలో అవుతున్నారు అర్థమవుతుంది. వీటిలో సుమారు 60% మేర ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వాళ్లే ఉన్నారు.
వరల్డ్ ప్యానెల్ ఓ నివేదిక ప్రకారం భారతీయులు సగటున ఒక్కొక్కరు 6 నెలల్లో మేకప్ రూ.1500 దగ్గర దగ్గరగా ఖర్చు పెడుతున్నట్లు ఈ నివేదికలో తేలింది. వీటిలో లిప్ స్టిక్ కొనుగోలు అధికంగా ఉన్నాయి. ఇలా అత్యధికంగా కొన్ని రూపాయలు విలువ చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ లో 38 శాతం లిప్‌స్టిక్ వినియోగించారు. ఆ తర్వాత స్థానంలో నెయిల్ పాలిష్‌లు, నెయిల్ ఆర్ట్ సంబంధించిన వస్తువులు ఉన్నాయి. కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు లిప్‌స్టిక్‌లు, నెయిల్ పాలిష్ లను కొనుగోలు చేస్తుంటే.. యుక్త వయసు వారు ప్రీమియర్ లిప్ బామ్ లు కొనుగోలు చేస్తూ మేకప్ సంస్థలకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో షాపర్స్ స్టాప్ రిపోర్ట్ ప్రకారం గత 3 నెలల్లో 1,50,000 మేకప్ కిట్ లు అమ్మేశారట. వీటిలో కేవలం 3% మాత్రం సేల్స్ రిటైల్ ద్వారా జరుగుతుంటే మిగతా ప్రొడక్ట్స్ అన్ని ఆన్లైన్ ద్వారా బై చేస్తున్నారు. ఇలా భారతీయులు అందం కోసం ఆరాటపడుతూ కాస్మెటిక్ సంస్థలకు గణనీయంగా లాభాలు తెచ్చిపెడుతున్నారు. వీరిలో వర్క్ చేసే ఉమెన్స్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వారు అందంగా కనిపించేందుకు ఎక్కువగా మేకప్ కిట్లను కొనుగోలు చేస్తున్నారట.