ఆ సినిమాలో న‌.. గ్నం… గా న‌టించాను.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన ఆండ్రియా..!

హాట్ బ్యూటీ ఆండ్రీయా తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టింది. ఈ ముద్దుగుమ్మ చిన్నతనం నుంచి మ్యూజిక్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది. ఆండ్రియా మంచి పియానో మ్యూజిషియన్. ఇక ఈమె ఓ లాయర్ అని కూడా చాలామందికి తెలియదు. ఇక ఆండ్రియా నటిగా కంటే కూడా సింగర్ గా ముందు ఇండస్ట్రీకి పరిచయం. సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా కాలివుడ్లో పచ్చైకిళి ముత్తుచ్ఛారం సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

దాని తర్వాత మంగత్త, విశ్వరూపం, తడాఖా, మాస్టర్, వడ చెన్నై లాంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా వయసు 36 ఏళ్లయినా ఇంకా వివాహం చేసుకోలేదు. ఇప్పటికీ మంచి యాక్టర్‌గా, సింగర్గా బిజీగా గడుపుతున్న ఆండ్రియా ఇటీవల పుష్పా సినిమా తమిళ్ వెర్షన్లో ఊ అంటావా మామ పాటను పాడి ఆ పాటకు అక్కడ మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.

ప్ర‌స్తుతం వ్యక్తిగత ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ఈమె ఇటీవల దర్శకుడు వెట్రిమార‌న్‌ నిర్మించిన అనల్ మేల్ పణితులి సినిమాలో అర్ధ‌నగ్నంగా నటించి ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవును నేను నిజంగా ఆ సినిమాలో ఓ సన్నివేశంలో నటించేటప్పుడు చాలా సిగ్గుపడ్డాను అయితే నిజ జీవితంలో నేను అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె పిశాచి 2, మాలిగై, నో ఎంట్రీ, బాబీ లాంటి ఆరు సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో సైంధవ్‌ సినిమాలో కూడా కీరోల్‌ను ప్లే చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.