రెండు ల‌వంగాలు నోట్లో వేసుకుంటే ఆ ప్రాబ్ల‌మ్స్ అన్నీ ప‌రార్‌…!

మనలో చాలామంది చిన్న చిన్న సమస్యలకు కూడా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. వంటింట్లో దొరికే వస్తువులతో చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చనే విషయం చాలామందికి తెలియదు. అలా వంటింట్లో పరిష్కారం చూపేవాటిల్లో లవంగాలు ఒకటి. వంటింటి సుగంధ ద్రవ్యాలలో లవంగాలు కీలక పాత్ర వహిస్తాయి. దంత క్షేమం, పంటి నొప్పి, జీర్ణ సమస్యలు, నోటి దుర్వాసన మొదలైన వాటికి చెక్ పెటోచ్చు.

లవంగాల్లో పోషక విలువలు, బయోయక్టివ్ సమ్మేళనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. రోగ నిరోధిక శక్తిని కూడా పెంచుతాయి. అలాగే రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే చెడు బ్యాక్టీరియాతో పోరాడడమే కాకుండా దంత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీనిలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణ చేస్తుందట. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాల్లో లవంగాలు ఒకటి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే వ్యాధులను నివారిస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్ల‌మేటరీ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. దగ్గు, జలుబును నయం చేసే లక్షణాలు లవంగాల్లో కలిగి ఉంటాయి. జలుబు చేసినప్పుడు శ్వాసకొశ నాళాలు బ్లాక్‌ అయితే వ్యాయామార్గాలు తెరుచ్చుకునేలా చెయ్యడంతో పాటు.. సులభంగా శ్వాశ తీసుకోవడానికి సహాయపడుతుంది.