కర్ణాటకలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ఎంబీఏ చదువుకున్న అమ్మాయికి 2020 ఆగస్టులో ఐటి ఇంజనీర్ అయినా వ్యక్తితో వివాహం జరిగింది. అయితే తన భర్త గే అంటూ వేగలేక పోతున్నానని విడాకులు కావాలంటు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి. ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తూ అత్తరింట్లో ఉండేది. కొద్ది కాలం తర్వాత ఉద్యోగం మానేసింది. పెళ్ళై రెండేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో చుట్టుపక్కల వారి ఒత్తిడి ఎక్కువైంది.
బంధువులు ఇరుగుపొరుగు వారు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో ఆ అమ్మాయి భర్తతో కూడా ఈ అంశంపై చర్చించింది. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కృత్రిమ గర్భధారణకు కూడా ప్రయత్నించింది. కానీ అది విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆమె భర్త మొబైల్లో చెక్ చేసింది. అందులో కనిపించిన ఫొటోస్, వీడియోస్ చూసి ఆమె షాక్ అయింది. ఆమె భర్త మరొక పురుషునితో కలిసి శారీరక సంబంధం పెట్టుకున్న వీడియోస్ అందులో కనిపించాయి.
దీంతో ఆమె భర్త గే అన్న విషయం బయట పడిపోవడంతో భర్త ఆమెను వేదించడం మొదలుపెట్టాడు. అవి తట్టుకోలేని ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త ఆమెకు ఫోన్ చేసి నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అంటూ బెదిరించడంతో నాకు విడాకులు ఇప్పించండి అని పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.