అయ్యయ్యో బాబీకి భారీ షాక్ ఇచ్చాడు గా.. బాలయ్యతో పెట్టుకుంటే అంతే మరి..!

నందమూరి నట సింహం ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలకృష్ణ ఏకంగా బాబీకి షాక్ ఇచ్చాడట. కరోనా టైం నుంచి బాలయ్య కు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లకు జనాలు వస్తారా రారా అంటూ డైరెక్టర్లు భయపడుతుంటే ఒక్క బాలయ్య మాత్రం అఖండ సినిమాతో వచ్చి దుమ్ము లేపేసాడు. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు.

ఆ తర్వాత అన్ స్టాపపబుల్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఈ షో సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్లాన్ చేయగా అది కూడా సక్సెస్ గా నిలిచింది. బాల‌య్య బర్తడే సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ మూవీ పిరియాడిక్ కథతో తెరకెక్కనుందని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ తో తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్టోరీ బాలయ్యకు నచ్చలేదట. దీనితో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో అనేది అధికారికం ఇంకా ప్రకటన రాలేదు.

ఇక ప్రస్తుతం బాలయ్య తన నెక్స్ట్ మూవీ కోసం కథ వెతుకుతున్నారని సమాచారం. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కానీ బాలయ్య ఇలా సడన్ షాక్ తో బాబీ పరిస్థితి ఏంటి అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి బాబీ కొత్త కథతో బాలయ్య అని ఆకట్టుకుంటాడా లేదా బాలయ్య స్థానంలో మరో హీరోని తీసుకుంటాడో చూడాలి.