చర్మం పై ముడతలు పోయి.. ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించేందుకు సింపుల్ టిప్స్ ఇవే..!

చర్మంపై ముడతలు సర్వసాధారణg కానీ కొన్ని మార్గాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. ముడుతలను తగ్గించే కొన్ని పద్దతులు గురించి తెలుసుకుందాం.
1.పండ్లు & కూరగాయలను ఎక్కువ తినండి :
పండ్లు మరియు కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ వలన చర్మానికి కలిగే ప్రమాదాలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనపడటంతోపాటు ప్రకాశవంతంగా చేసి వృద్దాప్య మార్పులను కనపడకుండా చేస్తుంది.

2.పొగత్రాగరాదు :
పొగతాగటం వలన శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు, చర్మంలో ఉండే ‘కొల్లాజేన్’ మరియు ‘ఎలాస్టిన్’ వంటి ముఖ్య సమ్మేళనాలు విచ్చిన‌మ‌వుతాయి. పొగతాగటం మానేయటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, చర్మం ముడుతలు కూడా తొలగిపోతాయి.

3.స‌రైన‌ నిద్ర :
శ‌రీరానికి స‌రిప‌డ నిద్ర లేక‌పోతే బాడీలో ‘కార్టిసాల్’ అధికంగా విడుదల చేయబడి, చర్మ కణాలను విచ్చిన్న పరుస్తుంది. కనుక‌ సరైన నిద్ర‌, విశ్రాంతి వలన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (మానవ పెరుగుదల హార్మోన్) ఎక్కువగా విడుదల చేయబడి, చర్మంపై ముడుతలు ఏర్పడకుండా చేస్తుంది.

4.మాయిశ్చరైజర్ వాడండి :
మాయిశ్చరైజర్‌ను వాడటం వలన చర్మ రంద్రాలు బిగుతుగా మారి ఎక్కువ సమయం పాటూ అలాగే ఉంటాయి. మాయిశ్చరైజర్‌లు చర్మాన్ని అందంగా కనపడేలా చేయటమే కాకుండా, చర్మంపై ఉండే గీతాలను, పగుళ్ళనుఆపి వాటిని ముఖంపై కనపడకుండా చేస్తుంది.

5.రోజులో ఎక్కువ సమయం కడగకండి
నీరు చర్మంలో ఉండే సహజ నూనెలను మరియు తేమను తొలగిస్తాయి. అంతేకాకుండా, సబ్బులో ఉండే తేమభరిత ఏజెంట్ లను కలిగి ఉంటాయి. కావున సబ్బుకు బదులుగా చర్మాన్ని శుభ్రపరిచే వాటిని వాడండి.

6.చేపలను ఎక్కువగా తినండి
సాల్మన్ ఫిష్ లో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉండటమే కాకుండా, ఒమేగా-౩ అనే ఫాటీ ఆసిడ్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ రకమైన ముఖ్య ఫాటీ ఆసిడ్ లు, చర్మానికి కావలిన పోషకాలను అందించి, యవ్వనంగా ఉంచి, ముడుతలను పూర్తిగా తొలగిస్తుంది.