గుడుంబా శంక‌ర్ VS గ‌బ్బ‌ర్‌సింగ్‌… ఇదేం క‌ర్మ‌రా సామీ…!

ప్రజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ చేయండి నడుస్తోంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. నిర్మాతలు వరుసగా పాత సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎక్కువగా ఫాన్ ఫాలోయింగ్ గతంలో హిట్ సినిమాలను సాధించిన హీరో సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు గుడుంబా శంకర్ సినిమాలో రీరిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

 

నాగబాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాను పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయబోతున్నట్లు వివరించాడు. ఇంతకుముందు జల్సా, ఆరెంజ్ సినిమాలు వచ్చిన కలెక్షన్స్ జనసేన పార్టీ ఫండ్ కి ఇచ్చిన సంగతి తెలిసింది. అదేవిధంగా గుడుంబా శంకర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని కూడా పార్టీ ఫండ్ కే ఇవ్వబోతున్నట్లు నాగబాబు స్పష్టం చేశాడు.

అలాంటి నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యకరమైన ట్విట్‌ షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ కెరరీలో ఓ మైల్డ్ స్టోన్‌గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాను సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేస్తున్నానంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయినా గుడుంబా శంకర్ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నట్లు నాగబాబు మొదట ప్రకటించారు. పైగా ఆ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అన్ని పార్టీ ఫండ్‌కి ఇవ‌బోతున్నారు.

ఇలాంటి టైంలో గబ్బర్ సింగ్ సినిమాలు రిలీజ్ చేయడం సరైన పని కాదంటూ.. గబ్బర్ సింగ్ కలెక్షన్స్ కేవలం బండ్ల గణేష్ కే సొంతమవుతాయి కనుక కొంతకాలం ఈ ఆలోచనను మానుకోమంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం కర్మరా సామి గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ ఒకేసారి రిలీజ్ చేస్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మ‌రి కొంతమంది పవన్ ఫ్యాన్స్. బండ్ల గణేష్ .. పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ కు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.