భోళాశంక‌ర్ ప్లాప్ అయినా కూడా గుడ్‌న్యూస్‌… ఏడుపులో న‌వ్వు అంటే ఇదే…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ఈనెల 11న థియేటర్స్ లో రిలీజ్ అయింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో అజిత్ వేదాళం సినిమాను రీమేక్‌గా ఇక్కడ నేటివిటీకి తగ్గట్లుగా మెహర్ రమేష్ మార్పులు చేసి తెలుగులో ఈ సినిమాని తరికెక్కించాడు.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రేక్షకులకు అనుకున్న రేంజ్ లో ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌టలేక పోయింది. ఇప్పుడు హిందీలో మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు భోళా శంకర్ టీం రెడీ అయ్యారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ టైం లోనే హిందీలో కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో హిందీలో విడుదల చేయడం వాయిదా వేశారు.

కానీ తాజాగా హిందీలో ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు రైట్స్ కొనుక్కున్న ఓ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దాంతోపాటు సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఓ పక్కన తెలుగు ఫ్లాప్ తో బాధపడుతున్న ఫ్యాన్స్ కు ఇది ఏడుపులో నవ్వు అని చెప్పాలి. ఇక చిరంజీవికి బాలీవుడ్ లో కూడా బానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా అక్కడ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రావడంతో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇక హిందీలో ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఆగస్టు 25న చూడాలి.