చిరు ఫ్యామిలీ రేర్ పిక్.. పవన్ భలే ఉన్నాడుగా..!!

పైన కనిపిస్తున్న ఫోటో తీసే సమయానికి పవన్ కళ్యాణ్ ఇంకా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపించడం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలి అనుకునే వారికి ఇన్స్పిరేషన్ గా మిగిలిన హీరో కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనదైన స్టైల్ తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు చిరంజీవి.

కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ అయ్యాడు. తనతో పాటు తన తమ్ముళ్లను కూడా సినీ రంగానికి పరిచయం చేశాడు. చిరంజీవి తమ్ముడుగా సిని రంగంలోకి ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ తరువాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాజుల ఏలుతున్న పవన్ కు అభిమానులు పవర్ స్టార్ అని ఇష్టంగా పిలుస్తారు. ఇప్పటికీ అదే పవర్, ఎనర్జీతో కంటిన్యూ అవుతున్న పవన్ కళ్యాణ్ హిట్, ఫ్లాప్ తో తేడా లేకుండా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ గానే ఉన్నాడు.పవన్ కళ్యాణ్ కేవలం నటుడు గానే కాకుండా సంఘ సేవకుడిగా , రాజకీయవేత్తగా కూడా ప‌నిచేస్తున్నాడు.

రీసెంట్గా విడుదలైన పవన్ చిత్రం బ్రో స‌క్సస్ సిదించ‌లేదు.ఇక హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ లైన్ అప్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కి సంబంధించిన ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో పవన్ అమ్మానాన్న, అన్న చిరంజీవి, సురేఖ, చిరు పెద్ద కుమార్తె, నాగబాబు తో కలిసి ఉండటం విశేషం. ఈ ఫోటో పై కొందరు మెగా అభిమానులు స్పందిస్తూ ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ భలే ఉన్నాడు అని కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటో తీసే సమయానికి పవన్ కళ్యాణ్ ఇంకా సినీ రంగంలోకి అడుగు పెట్టినట్లుగా కనిపించడం లేదు.