ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీలు కావడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. సోషల్ మీడియా పుణ్యంతో చాలామంది సెలబ్రిటీలుగా మారి బయటకు వస్తున్నారు. అదేవిధంగా అలా బయటకు వచ్చిన వారిలో కొందరు పాపులర్ యి చిత్రపరిశ్రమలో కూడా అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పుడు అలాగే యాంకర్ గా కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత హాట్ భామగా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ.
సినిమాల్లో హీరోయిన్గా నటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ప్రతిరోజు హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ అందరికీ పిచ్చెక్కిస్తుంది. ప్రతిరోజు విష్ణు ప్రియ హాట్ పిక్స్ కోసం ఆమె అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. ఇతరుణంలోనే విష్ణుప్రియకు సంబంధించిన ఓ లేటెస్ట్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇక విష్ణుప్రియ యాంకర్ గానే కాకుండా డాన్స్ లోను ఎంతో టాలెంటెడ్ అని ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంది. గతంలో ఆమె ‘జర్రీ జర్రీ’ అనే సాంగ్లో చేసిన డ్యాన్స్ తో యూత్ ను ఫిదా చేసింది. అందులో విష్ణు ప్రియ నడుము తిప్పడం చూసి పెద్ద పెద్ద డాన్సర్లు సైతం షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత విష్ణు ప్రియ సినిమాల్లో అవకాశం వస్తుందని అనుకున్నారు. కాని ఇప్పటికీ ఆమెని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలోనే తన ప్రతాపం చూపిస్తూ వస్తుంది.
ఇప్పుడు తాజాగా విష్ణు ప్రియ లేటెస్ట్ గా ఓ సాంగ్ కు మరోసారి నడుం తిప్పుతూ హంగామా చేసింది ఫోట్టి గౌనులో ఆమె డాన్స్ చేస్తుంటే కుర్రాళ్ళు షాక్ అయ్యారు. అందాలన్నీ ఆరబోస్తూ డాన్స్ చేస్తూ తన అందాలని చూపిస్తూ ఏం మాత్రం బెరుగు లేకుండా డాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విష్ణు ప్రియ పై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికైనా ఈమెను సినిమాల్లోకి తీసుకోండి అంటూ కొందరు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా విష్ణుప్రియకు సినిమా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
View this post on Instagram