డ‌యాబెటిస్‌తో బాధ‌పడుతున్నారా… ఈ 3 ఆహారాల‌తో కంట్రోల్ ప‌క్కా…!

ప్ర‌స్తుతం బిజీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా మనుషుల‌లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా మధుమేహం చాలామందిలో కామన్‌గా వినిపిస్తుంది. బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేసే విషయంలో ఫుడ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక మీరు తినే ఆహారంలో ఈ మూడు పదార్థాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

కాకరకాయ :
కాకరకాయ షుగర్ పేషెంట్స్ కు ఎంతో మంచిదని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో కాకరకాయను తీసుకోవాలి.. కాకరకాయ రసం తాగిన రక్తంలో చక్కెర స్థాయి నార్మల్గా ఉంటుంది.

మెంతులు :
ఇది చాలామందికి తెలిసే ఉంటుంది.. డయాబెటిస్ అదువు చేయడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. దీనిలో ఫైబర్ మెటబాలిజం.. కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు మెంతి గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నార్మల్గా ఉంటుంది.

గ్రీన్ టీ :
గ్రీన్ టీ పాలిఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు కలిగి ఉంటుంది. దీని తాగడం వల్ల షుగర్ అదుపులో ఉండడమే కాక డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. అలానే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది. రోజు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.