బాహుబలి ,RRR సినిమా తర్వాత ప్రేక్షకులు అంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో విజువల్ చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని త్రీడీలో చిత్రీకరించడం జరిగింది.. బాహుబలి సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించిన ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను నిరాశపరిచారు. ఇప్పుడు తాజాగా ఆది పురుష్ సినిమా పైన అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో కొంతమంది అభిమానులు సైతం ప్రభాస్ ని మరొక లెవల్లో చూడాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో వస్తున్న అది పురుష్ చిత్రం శ్రీరాముని కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా పైన ఎంతో ఆసక్తి నెలకొంది.. టీజర్ తో నిరాశపరిచినప్పటికీ ట్రైలర్‌తో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నారు డైరెక్టర్ ఓం రౌత్.. నిన్నటి రోజున తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆది పురుష్ సినిమా ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ అద్వంతం రావణుడు పై శ్రీరాముని సైన్యం దండయాత్రకు వెళుతున్న తిరుని చూపించడం జరిగింది. టీజర్ లో కంటే సైఫ్ అలీ ఖాన్ ట్రైలర్ లోనే చాలా గంభీరంగా కనిపిస్తున్నారని చెప్పవచ్చు.
ముఖ్యంగా సీతను అపహరించే తీరుని ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక ఆ తర్వాత రాముడు వానర సైన్యంతో రావణాసుడిపై దండయాత్రకు బయలుదేరిన తీరును కూడా చూపించారు. ఆది పురుష సినిమా మొదట ఆగస్టు 11 గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ ఏడాది జనవరి 12కి వాయిదా వేయడం జరిగింది.. కానీ చివరికి ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.