మనోజ్-మౌనిక రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారా..?

మంచు మనోజ్, భూమ మౌనికల పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. దీంతో వీరి అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మనోజ్ కూడా కెరియర్ పరంగా బాగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. భూమ మౌనికకు కూడా పొలిటికల్ పరంగా బ్యాగ్రౌండ్ బాగానే ఉన్న సంగతి తెలిసిందే .మౌనికకు పొలిటికల్గా ఎదగాలని కోరికలు ఉన్నప్పటికీ ఎదగలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మౌనిక,మనోజ్ రాజకీయాలలో బిజీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Manchu Manoj to Marry, Credits Bhuma Mounika for Support -  TeluguBulletin.com
ఇక మన సోషల్ మీడియా వేదికగా తన అక్క మంచు లక్ష్మిని మెచ్చుకుంటూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. మోహన్ బాబు కుటుంబంలోనే ఈ పెళ్లి ఇష్టం లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మనోజ్ ,మౌనిక పెళ్లికి సంబంధించి పూర్తి క్రెడిట్ మొత్తం మంచు లక్ష్మినే దక్కించుకుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమొ వల్లే మంచు లక్ష్మీ లాంటి అక్క దొరికింది అంటూ మనోజ్ ప్రస్తావించడం జరిగింది. అలాగే మనోజ్ కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

మనోజ్ పొలిటికల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో ఇంకా స్పష్టత రాలేదు. మనోజ్ రాజకీయాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. కేవలం సినిమాలలోని బిజీగా ఉన్నారు. మనోజ్ మరి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని రాజకీయాలలోకి వస్తారో చూడాలి మరి. మనోజ్, మౌనిక ఇద్దరు కూడా రాజకీయాలలో ప్లాన్ చేసి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Latest