రెండు ఆస్కార్ అవార్డుల‌ను గెలుచుకున్న ఏకైక ఇండియ‌న్ ఎవ‌రో తెలుసా?

ఆస్కార్ అవార్డుల వేడుకలకు అంతా సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని గంటల్లోనే అంగరంగ వైభవంగా ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న నేప‌థ్యంలో.. భార‌తీయులంద‌రి దృష్టి ఆస్కార్‌పై మ‌ళ్లింది. తెలుగు వారు `ఆర్ఆర్ఆర్‌`కు ఖ‌చ్చితంగా ఆస్కార్ వ‌స్తుంద‌ని ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు.

ఇక‌పోతే ఇంత‌కుముందు ఇండియా నుంచి ఆస్కార్‌ అందుకున్న ప్రముఖులు కొంద‌రు ఉన్నారు. భాను అథైయా తొలి భారత ఆస్కార్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.1983లో విడుదలైన గాంధీ సినిమాకు గానూ ఆమె 55వ ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా అవార్డు గెలుచుకుంది. ఆ త‌ర్వాత సత్యజిత్ రే, ఏ.ఆర్‌ రెహమాన్‌, రసూల్‌ పూకుట్టి, గుల్జర్‌, గునీత్‌ మోన్గా మ‌న ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు అందుకున్నారు.

అయితే వీరిలో ఒకే ఒక్క వ్య‌క్తం మాత్రం ఏకంగా రెండు ఆస్కార్ అవార్డుల‌ను గెలుచుకుని రికార్డు సృష్టించారు. ఇంత‌కీ ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు స్వర మాంత్రికుడు ఏ.ఆర్‌ రెహమాన్‌. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకూ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇలా రెండు అకాడమీ అవార్డులను ద‌క్కించుకున్న తొలి భారతీయుడిగా ఏ.ఆర్ రెహమాన్‌ రికార్డు సృష్టించాడు.

Share post:

Latest