మంచు విష్ణు మనసు మంచులా కరిగిపోయినవేళ… నటి పాకీజాకు పెద్దమొత్తంలో సాయం!

సినిమా పరిశ్రమ అంటేనే రంగురంగుల లోకం. దూరపు కొండలు నునుపు అన్న మాదిరి ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఇక్కడ స్టార్ అవుతారో, ఎవరు బేకార్ అవుతారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వారు వుంటారు, అదేవిధంగా అంతే స్పీడుగా దుకాణం సర్దుకొనేవారు కూడా వుంటారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నటీనటులు ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి తినడానికి తిండి లేని పరిస్థితిని గడుపుతూ వుంటారు.

అలాంటి వారిలో సీనియర్ నటి పాకీజా ఒకరు. ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగిన పాకీజా ప్రస్తుతం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని మేలో ఎంతమందికి తెలుసు. ఇప్పటికే ఆమె పరిస్థితి చూసి చెలించిన చాలామంది సెలబ్రిటీలు తోచిన విధంగా సహాయం చేసిన సంగతి తెలిసిందే. పాకీజా పరిస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెకు లక్ష రూపాయలు సాయం చేసి తన దానగుణాన్ని చాటుకున్నారు. అదేవిధంగా మెగా బ్రదర్ నాగబాబు సైతం లక్ష సాయం చేసి మంచి మనసును దాటుకున్నారు.

ఇక వారి మార్గంలోనే మంచు విష్ణు తాజాగా పాకీజాకు సాయం చేసాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, పాకీజా కష్టాల్లో ఉందని తెలుసుకున్న మోహన్ బాబు స్వయంగా పాకీజాతో ఫోన్ లో మాట్లాడి ఇంటికి పిలిపించారని సమాచారం. ఈ క్రమంలోనే తన సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ పాకీజాకి అందించనున్నాడు విష్ణు. ఇదే ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెళ్లడించింది. మా అసోసియేషన్ కార్డు పొందాలంటే రూ.లక్ష రూపాయలు కట్టాలట. ఇప్పుడు ఆమె అసోసియేషన్ కు ఆ డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే మంచు విష్ణు ఆ మొత్తాన్ని చెల్లించి, ఆమెకు కార్డు ఇస్తాడు అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.

Share post:

Latest