వామ్మో..పుష్ప -2 సినిమా కోసం రూ.1000 కొట్లా..?

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. పుష్ప చిత్రం దాదాపుగా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్ పార్ట్-2 నీ మరింత గ్రాండ్ గా ఆవిష్కరించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒకసారి కొత్త ఫీల్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని సుకుమార్ ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది.

Allu Arjun's Pushpa 2 coming in 2024! Get ready for an action-packed  experience.” – Entrepenuer Stories
ఇప్పుడు ఇదంతా ఇలా ఉండగా పుష్ప సీక్వెల్ థియేట్రికల్ బిజినెస్ గురించి ఒక టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే పుష్ప సినిమా థియేటర్స్ కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.1050 కోట్ల డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం జరిగింది..RRR థియేట్రికల్ బిజినెస్ అన్ని భాషలలో కలుపుకొని రూ.900 కోట్ల రూపాయలు జరగగా పుష్ప-2 కోసం అల్లు అర్జున్ రూ.1050 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే RRR సినిమా కంటే పుష్ప-2 చిత్ర పెద్ద సినిమా అవుతుందని ట్వీట్ చేయడం జరిగింది.దీంతో ఇప్పుడు ఒక్కసారిగా ఈ విషయం వైరల్ కావడం జరిగింది. దీనిపైన అటు బన్నీ అభిమానులు, మరొకవైపు మెగా యాంటీ అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుకుంటున్నారు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు పుష్ప-2 కి మార్కెట్ గట్టిగానే ఉందని వెయ్యి కోట్లు కలెక్షన్ చేయడం కష్టమేమి కాదంటూ బన్నీ అభిమానులు భావిస్తున్నారు. మరి కొంతమంది ఇది చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది పుష్ప -2 సినిమాకి అంత లేదని కామెంట్లు చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

Share post:

Latest