తనపై వస్తున్న రూమర్లపై చెక్కు పెట్టిన వెన్నెల కిషోర్..!!

వెన్నెల సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు వెన్నెల కిషోర్ గా పేరు తెచ్చుకున్నారు. వెన్నెల కిషోర్ అసలు పేరు బొక్కల కిషోర్ కుమార్..అయితే వెన్నెల సినిమా చేసిన తర్వాత ఆర్థిక సమస్యలతో అమెరికాలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఇందుమతి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బిందాస్,కరెంట్ సినిమాలలో నటించి నంది అవార్డు కూడా తీసుకున్నారు. 1980 సెప్టెంబర్ 19న తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో జన్మించారు..

Vennela Kishore Turns Baddie For Indian 2? - Filmify.in

వెన్నెల కిషోర్ పద్మజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి హైదరాబాదులో ఉద్యోగం చేసేవారు. సినిమాల మీద మోజుతో కిషోర్ పూర్తిగా సినిమాలు తీయాలని తన ఉద్యోగానికి రాజీనామా చేశారట.. వందకు పైగా సినిమాలు నటించాడు.

ప్రస్తుతానికి కూడా చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా “మందలో ఒకడిగా ఉండకు వందలో ఒకడిగా ఉండు”అనే మాటను స్ఫూర్తిగా తీసుకొని నేడు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు. కాగా వెన్నెల కిషోర్ మరిన్ని సినిమాల్లో నటించారు…

గత కొన్ని రోజులుగా వెన్నెల కిషోర్ మొదటిసారి విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కమలహాసన్ భారతీయుడు-2 సినిమాలలో వెన్నెల కిషోర్ విలన్ రోల్ చేస్తున్నారన్న వార్త వినిపిస్తోంది. ఈ విషయమై ఓ ఫ్యాన్ ‘ఏంటి కాకా.. ఇది నిజమా?’ ఇలాంటి ప్రశ్నలతో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ ఈ విధంగా స్పందించారు. ‘ఇండియన్ 2 లో లేను’ పాకిస్తాన్ -3 లో లేను అని తెలిపారు. వెన్నెల కిషోర్ స్పందనతో ఈ పుకారుకు ఎండ్ కార్డు పడింది. అంటూ అభిమానులు థాంక్స్ భయ్యా క్లారిటీ ఇచ్చినందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest