టాలీవుడ్ లో సూప‌ర్ హిట్స్‌.. బాలీవుడ్ లో డిజాస్ట‌ర్స్ అయిన సినిమాలు ఇవే!

ఒక భాషలో హిట్‌ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. అలా రీమేక్ చేసిన చిత్రాలు హిట్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ లో బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. పాపం ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఆ బాలీవుడ్ హీరోలకు మన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి.

జెర్సీ.. తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్ర‌మిది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రెండు జాతీయ అవార్డుల‌ను అందుకున్న‌ది. ఇదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. గౌత‌మ్ తిన్న‌నూరినే బాలీవుడ్ లోనూ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. కానీ, గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా మిగిలింది.

హిట్ ది ఫ‌స్ట్ కేస్‌.. విశ్వ‌క్ సేన్ హీరోగా వ‌చ్చిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. టాలీవుడ్ లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డ‌మే కాదు.. ఈ మూవీకి సీక్వెల్ గా వ‌చ్చిన హిట్ 2 మంచి విజయం సాధించింది. అయితే హిట్ ది ఫ‌స్ట్ కేస్ ను బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావ్ రీమేక్ చేయ‌గా.. అక్క‌డ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది.

అల వైకుంఠ‌పుర‌ములో.. టాలీవుడ్ లో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన చిత్రాల్లో ఒక‌టి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ రూపొందించిన ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు చేసింది. ఇక ఇదే సినిమాను `షెహ‌జాదా` టైటిల్ లో ఇటీవ‌ల బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్య‌న్‌, కృతి స‌న‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం.. నార్త‌లో డిజాస్ట‌ర్ గా మిగిలింది.

Share post:

Latest