ఆ విషయంలో సత్తా చాటిన టాలీవుడ్ హీరోయిన్స్.. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..

ఒకప్పుడు సినిమా అంటే హీరో,హీరోయిన్ ఇద్దరికి సమానమైన ప్రాముఖ్యత ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే సినిమా లో పెడుతున్నారు. ఒక సినిమా లో ఒకడే హీరో ఉంటే హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురిని పెడుతుంటారు. సాంగ్స్, ఎక్స్‌పోసింగ్ కోసమే హీరోయిన్స్ అన్నట్లుగా చూపిస్తుంటారు దర్శకులు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం గ్లామరస్ పాత్రలు చేసిన్నప్పటికి హీరో లేకుండా ఉన్న పవర్‌ఫుల్ లేడీ ఒరియాంటెడ్ సినిమా లో నటించి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించారు.

మొదటిగా అనుష్క గురించి మాట్లాడుకుంటే అరుంధతి సినిమా కంటే ముందు ఆమె అన్ని గ్లామరస్ పాత్రలోనే నటిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ అరుంధతి సినిమా తీసే సమయం లో అందరూ లేడీ ఒరియాంటెడ్ సినిమా కోసం అంతా భారీ బడ్జెట్ అవసరమా అని అనుకున్నారు. కానీ ఒకసారి సినిమా రిలీజ్ అయ్యాక అందరూ అరుంధతి సినిమా ని చూసి ఆశ్చర్యపోయారు. సినిమాలో అనుష్క నటన ఆమె మొఖంలో ఒకవైపు జేజమ్మ గా రాజసం ఉట్టిపడుతుంటే, ఇంకోవైపు భయపడుతున్న పాత్రలో చూసి అంతా ఫిదా అయిపోయారు. అప్పట్లో మగధీర సినిమా తరువాత మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమా అరుంధతి.

ఇక కీర్తి సురేష్ నటించిన మహానటి బయోపిక్ సినిమా. సావిత్రి పాత్రలో కీర్తి నటించడం కాదు జీవించింది. చాలా కాలంగా సినిమాలకు చూడనివాళ్ళు కూడా థియేటర్స్ బాట పట్టి మహానటి సినిమా చూసారు. అసలు సావిత్రి పాత్ర పోషించడం కోసమే కీర్తి ఇండస్ట్రీకి పరిచయం అయిందా అనేలా చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు సిని ఇండస్ట్రీ ఏలుతున్న రోజుల్లో సావిత్రి ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడం మాములు చిన్న విషయం కాదని ఇప్పటి తరం వారికీ మహానటి సినిమా చూసాక అర్థం అయింది.

సమంత రూత్ ప్రభు ‘ఓ బేబీ ‘ సినిమాతో తన సత్తా చాటుకుంది. యంగ్గా కనిపిస్తూనే నటించడం అనేది మాములు విషయం కాదు. సమంత నటన చూసి థియేటర్లలో జనం ఈలలు వేశారు. 80 ఏళ్ళ భామ పరిగెడుతున్న సీన్ లో బేబీ పాత్ర తప్ప అసలు సమంత కనపడలేదు. అంతలా పాత్రలో లీనమయిపోయింది సామ్.

నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన తన నటనలోని సత్తాని నిరూపించుకుంది. మయూరి తర్వాత కర్తవ్యమ్ వంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకుంది . ఇక పార్వతి తిరువొత్తు ఊయారే మూవీలో ఆమె నటన చూస్తే ఆహా అనాల్సిందే. అయితే నయనతార ఎప్పుడు తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest