రామ్ చరణ్ కు నచ్చిన సినిమాలు ఇవేనట..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. RRR చిత్రం ద్వారా గ్లోబల్ స్టార్ గా కూడా పేర్కొన్నారు రామ్ చరణ్ .గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న రామ్ చరణ్ అక్కడ స్థానిక మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేయడం జరిగిందట రామ్ చరణ్ వాటి గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.

Hey Angela Bassett, Ram Charan Is Looking Forward To Clicking A Selfie With  You
టీనేజ్ లో ఉన్న సమయంలో జూలియా రాబర్ట్స్, కేథరిన్ జీటా జోన్స్ అంటే క్రషన్ని వేశారని కూడా తెలియజేయడం జరిగింది ఇక ఇప్పుడు తనకు నచ్చిన సినిమాల గురించి కూడా తెలియజేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కు నచ్చిన చిత్రాలలో ది నోట్బుక్ సినిమా కూడా ఒకటని తెలిపారు. ఇక రెండోది టెర్మినేటర్-2 ఈ సినిమాను నేను ఎల్ఈడి డిస్ప్లేలో 50 సార్లు చూశానని అది తనకు చాలా బాగా నచ్చిందని తెలియజేశారు. అలాగే గ్లాడియేటర్ అన్ని టర్ములలో ఈ సినిమాను చూసి చాలా ఇష్టపడ్డాను అని తెలిపారు.

అలాగే తెలుగులో దానవీరశూరకర్ణ ,బాహుబలి, రంగస్థలం సినిమాలు అంటే తనకి చాలా ఇష్టమని తెలిపారు. ఇక డైరెక్టర్ శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఇండియా తన ఫేవరెట్ చిత్రాలలో ఒకటి అని తెలియజేశారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి ,కీరవాణి సైతం అమెరికా పర్యటనలో ఉన్నారు.RC -15 చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు రామ్ చరణ్.

Share post:

Latest