చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న విలన్.. కారణం..?

చిరంజీవి సినిమాలలోనే కాకుండా పలు సేవా కార్యక్రమాలలో కూడా బాగా పేరు సంపాదించారు. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుతోపాటు ఎంతోమందికి సహాయం చేసి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపారు చిరంజీవి. తన ఇంటికి సహాయానికి ఎవరు వచ్చినా సరే వారిని కాదనకుండా కచ్చితంగా చేస్తూ ఉంటారు చిరంజీవి. కానీ తాను చేసిన సహాయాన్ని ఎప్పుడూ కూడా చెప్పుకోరు. కానీ చిరంజీవి నుంచి సహాయం పొందిన వారు మాత్రం అప్పుడప్పుడు తన గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఒక ప్రముఖ నటుడు పలు సినిమాలలో విలన్ గా నటించారు. చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.వాటి గురించి తెలుసుకుందాం.

Ponnambalam Thanked This Actor For Spending Rs. 45 Lakh For His Health  Treatment !! - Chennai Memes
ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించి మెప్పించిన నటుడు పొన్నబలం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పేరు గుర్తుపట్టకపోయినా ఆయన ఫోటో చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు. గతంలో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి గారే తనకు రూ .40 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారని తన పాలిట దైవంగా నిలిచారని ఎమోషనల్ అయ్యారు పొన్నబలం. 1990వ సంవత్సరంలో స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా నటించారు. ఈయన తెలుగులో కూడా టాప్ హీరోల అందరి సినిమాలలో కూడా విలన్ గాని మెప్పించారు.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా మాయమైపోయారు. ఆ తర్వాత ఏకంగా ఆస్పత్రి బెడ్ పైన కనిపించారు.. దీంతో ఇతనికి రెండేళ్ల క్రితమే కిడ్నీ ప్రాబ్లంస్ వచ్చినట్లు తెలియజేశారు. ఎవరైనా సహాయం చేస్తారా అని చూస్తున్నాను అప్పుడే నాకు చిరంజీవి గారు గుర్తుకువచ్చారు. నా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకొని తన ఆరోగ్యం బాగాలేదు ఏమైనా సహాయం చేయండి అన్నయ్య అని మెసేజ్ పెట్టాను అలా మెసేజ్ వచ్చిన పది నిమిషాల తర్వాత తనకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది.. తన పూర్తి వివరాలు తెలుసుకొని తన వైద్యం అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest