ఎట్టకేలకు విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టిన స్టార్స్..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా పేరు పొందారు హీరో అజిత్ హీరోయిన్ షాలిని. ఒక చిత్రంలో కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే అజిత్, షాలినికి వివాహమై 21 ఏళ్లు అవుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి పలు రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వీటికి తోడుగా డైరెక్టర్ రమేష్ ఖన్నా కూడా చేసిన వాక్యాలు అజిత్- షాలిని విడాకులు వార్తలపై మరింత బలం చేకూర్చే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికి వీరిద్దరూ ఏ విధంగా స్పందించలేదు.

When Ajith Kumar recalled his love story: 'I cut Shalini's wrist by  accident, it started there' | Entertainment News,The Indian Express

ఎంతో అన్యోన్యంగా దాంపత్యాన్ని కొనసాగిన వీరు విడాకులు వార్తలతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. అయితే తాజాగా వీరు ఇలాంటి వార్తలు ఒక్క ఫోటోతో చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అజిత్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన కొన్ని ఫోటోలను అజిత్తో దిగిన ఫోటోను షాలిని త సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. దీంతో అజిత్, షాలిని వారి పిల్లలు తో ఉండడం వల్ల ఆత్మసంతృప్తి చెందుతుందని ఒక క్యాప్షన్ కూడా తెలియజేసింది.

ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ లవ్ సింబల్స్ ను జోడించింది షాలిని. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .ఈ ఫోటోలు చూసి అజిత్ ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతున్నారు. ఏడాది సంక్రాంతికి వచ్చిన తెగింపు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు అజిత్. ఇక త్వరలోనే తన 62వ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.

Share post:

Latest